వరంగల్: చెత్త కుప్పలో అంగన్వాడీ వడియాలు

78చూసినవారు
అంగన్వాడీ సెంటర్లో పసి పిల్లలకు అందాల్సినవడియాలు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. ఈఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రాంపూర్ గ్రామంలోని రైతు వేదిక సమీపంలో బుధవారం జరిగింది. అంగన్వాడీ చిన్నారులకు రోజుకు 20 గ్రాముల చొప్పున సాయంత్రం 3 గంటలకు స్నాక్స్ గా అందించే పోషకాలు గల వడియాలు చెత్త కుప్పలో దర్శనమివ్వడంపై విమర్శలకు దారి తీసింది. దీనిపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్