ఎం సిపిఐ యు పదవ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి అని ఎం సిపిఐ యు నల్లబెల్లి సహాయ కార్యదర్శి మార్త నాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం నర్సంపేట, నల్లబెల్లి మండల కేంద్రంలో ఎం సిపిఐ యు ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా పదవ మహాసభలను ఈనెల 27 28 న జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
అనంతరం నాగరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పైన విపరీతమైన భారాలు మోపుతున్నారని పేద మధ్యతరగతి ప్రజల పైన మోయలేనంత భారాలు మోపడం సరైన పద్ధతి కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు రవాణా చార్జీలు పెంచి ప్రజల పైన గుదిబండగా భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజలను అప్పులపాలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద మధ్య తరగతి ప్రజలను అప్పుల ఊబిలోకి పంపారని మండిపడ్డారు.
ఈ నెల 27న నర్సంపేటలో జరిగే ఎం సిపిఐ యు పద వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని దీనికి వేలాది మంది ఎర్ర సైన్యం కార్మికులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాయిరాం సాయి తేజ రమేష్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.