హెర్బల్ మందు వైద్యం తో ప్రాణాపాయ స్థితిలో మహిళ

64చూసినవారు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జోజెరువు గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ ఎం. యాదలక్ష్మి కొన్నేళ్లుగా మూర్చవ్యాధితో బాధపడుతుంది. ఈ నెల 16న కవిత అనే మహిళ హెర్బల్ మందు 15 రోజులు వాడితే మూర్చవ్యాధి నమమవుతుందని నమ్మించింది. యాదలక్ష్మీతో రూ. 3వేల మందును కొనుగోలు చేయించి వాడాలని చెప్పింది. రెండు మూడు రోజులు వాడటంతో అపస్మారక స్థితికి చేరడంతో ఈనెల 19న ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య బృందం పరీక్షించి మూర్చవ్యాధి తిరగబెట్టిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్