ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) నర్సంపేట ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ అధ్యక్షతన కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ 2024 పై బుధవారం కార్యశాల నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ బడ్జెట్ విశేషాలు తెలిపారు. ఈ బడ్జెట్ ప్రధానంగా తొమ్మిది ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని 48. 21 లక్ష కోట్ల వ్యయం అంచనాతో తయారు చేసారని తెలిపారు.