పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

70చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలోని 2003-2004కు చెందిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి విద్యార్థులు పాఠశాలలో కలియ తిరుగుతూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ కష్టసుఖాలను చెప్పుకుంటూ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు.

సంబంధిత పోస్ట్