ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది అని తొర్రూర్ పట్టణానికి చెందిన శ్రీ నలంద పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రవీందర్ పేర్కొన్నారు. గురువారం పాఠశాలలో ఎన్నికలు జరిగే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం పోలింగ్ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. కాగా ఈ ఎలక్షన్ లో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఓటింగ్ లో పాల్గొని పాఠశాలకు చెందిన హెడ్ గర్ల్,హెడ్ బాయ్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ యాకన్న, ప్రైమరీ కోఆర్డినేటర్ అశ్విని, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ ఇన్చార్జులు శ్వేతా రెడ్డి, పుష్ప, ఎన్నికల అధికారులు మురళి, నవీన్,శిరీష, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.