మాదకద్రవ్యాలకు ఎవరు బానిసలు కావద్దు: సివిల్ కోర్ట్ జడ్జి

78చూసినవారు
మాదకద్రవ్యాలకు ఎవరు బానిసలు కావద్దు: సివిల్ కోర్ట్ జడ్జి
మాదకద్రవ్యాలకు ఎవరూ బానిసలు కావద్దని సివిల్ కోర్ట్ జడ్జ్ మట్ట సరిత విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తొర్రుర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు జెల్లా లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సివిల్ కోర్ట్ జడ్జ్ సరిత మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వాడడం, రవాణా చేయడం నేరమని, అటువంటి వారిని చట్టం కఠినంగా శిక్షిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు, నోడల్ అధికారి బుచ్చయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శిలు ప్రవీణ్ రాజు, రామకృష్ణ, పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్