సామాజిక సేవా కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమైందని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కన్నా పరశురాములు అన్నారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి అధ్యక్షురాలు వజినపల్లి దీప ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ఆట వస్తువులను పంపిణీ చేయగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి సామాజిక అవసరాలకు తగిన సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. పట్టణంలోని అంగన్వాడి కేంద్రాల్లోని చిన్నపిల్లలకు ఆటవస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ రేవూరి వెంకన్న, క్లబ్ ప్రధాన కార్యదర్శి వజినపల్లి శైలజ, కోశాధికారి చీదర నీలిమ, పూర్వ అధ్యక్షులు డాక్టర్ వి. శారద, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.