25 మంది పత్తిపాక రైతుల ఆందోళన

58చూసినవారు
నకిలీ వరి విత్తనాలను అమ్మి మోసం చేశారని ఆరోపిస్తూ బుధవారం పరకాలలో విత్తన దుకాణం ముందు శాయంపేట మండలం పత్తిపాక రైతులు ఆందోళనకు దిగారు. మొత్తం 25 మంది రైతులు 70 ఎకరాల్లో ప్రైవేటు కంపెనీకి చెందిన విత్తనాలను తీసుకెళ్లి వరి పంటను వేశారు. ఎకరాకు 45 బస్తాల దిగుబడి వస్తుందని చెప్పారని, తీరా గింజలు లేక తాలుతో సగం బస్తాల దిగుబడి రావడం లేదని ఆరోపిస్తూ రైతులు తమ నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్