వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ వ్యాప్తంగా జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు పోరాడారని, ప్రజలందరూ కుల మత జాతి వర్గ బేధాలు లేకుండా కలసి మెలసి ఉండాలని నవ భారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం అవ్వాలని కోరారు.