గీసుగొండ మండలంలోని ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులకు ఆదివారం తిరుపతిలో జరిగిన విశ్వవేధంగా విజ్ఞాన జ్యోతిష్య సమ్మేళన సమూహంలో సువర్ణ కంకణ ధారణ, జ్యోతిష్యంలో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. భవిష్యత్తు జ్యోతిష్యవాణిపై చర్చ గోష్టి , ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రస్వామి ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనాచార్యులకు గౌరవ డాక్టరేట్, సువర్ణ కంకణ దారణ బహుకరించారు.