దామర మండల కేంద్రంలోని సింగరాజుపల్లి గ్రామం నుండి హరిశ్చంద్రనాయక్ తండా వరకు ఎస్టి ఎస్డిఎఫ్ నిధుల నుండి 3 కోట్ల 4లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలాన వెనుకకు నెట్టబడిన గ్రామాలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గుర్తించి ప్రజలకు రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం కృషి చేస్తుందన్నారు.