రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ వరంగల్ జిల్లా శాఖ ఆత్మీయ అభినందన సభ, పదోన్నతి పొందిన ప్రధానోపాధ్యాయులకు, భాషా పండితులకు నూతనంగా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకు ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా అపరిశృతంగా ఉన్న పండితుల సమస్యలను పరిష్కరించిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులకు నోచుకోని భాషా పండితులకు పదోన్నతులు ఇచ్చిందన్నారు.