గీసుగొండ మండల కేంద్రంలో గత రెండు సంవత్సరాలనుండి అధిక సంఖ్యలో కోతులు ప్రజలను బయపెడుతూ గీరుతు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అధికంగా పోలీసుస్టేషన్, తహసీల్ధార్, యూనియన్ బ్యాంకు, మండలపరిషత్ జనసంచారం ఎక్కువగా ఉన్న కూడలి వద్దా ఇబ్బంది చేస్తున్నాయి. గత సoవత్సరం మండల ఆఫీస్ ఉద్యోగులను చేతులు వీరిగేటట్టు గాయాలు చేశాయి. ఎప్పటికైనా అధికారులు స్పందించి కోతులను పట్టుకొని అడవులలో విడిచి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.