వరంగల్ జిల్లా మోగిలిచర్ల లో రూ. 8. 40 కోట్లతో నిర్మించే మూడు 33/11 కె. వి విద్యుత్ సబ్ స్టేషన్ కు ఆదివారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి బట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇందిరమ్మ ఆత్మ భరోసా క్రింద త్వరలో భూమిలేని వ్యవసాయ కుటుంబాలు, కూలీలకు ప్రతి సంవత్సరం రూ. 12 వేలు ఇస్తూ, అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకెళుతున్నదన్నారు.