వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం సృష్టించారు. ఏనుమాముల ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2, గీసుకొండ, దామెర, బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో మంగళవారం భారీగా చోరీ జరిగింది. ప్రతి దొంగతనంలోనూ కట్టర్లతో తాళాలను దుండగులు పగులగొట్టారు. ఈ దొంగతనాలు చేసింది ఒకే ముఠా అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాలనీవాసులంతా
సంక్రాంతి వేడుకల్లో ఉండగా అదునుగా దొంగలు భావించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.