వరంగల్ కీర్తి నగర్, గరీబ్ నగర్ లో విడివిడిగా జరిగిన సమీక్ష సమావేశంలో అభివృద్ధి పనుల పురోగతి, సమస్యల పరిష్కారంపై శనివారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. అధికారులతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి, మాదకద్రవ్యాలు మత్తు పదార్థాలపై గట్టిగా నిగా పెంచాలని, వాటిని సప్లై చేసే వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.