మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం గీసుగొండ మండలంలోని నందనాయక్ తండాలో చోటు చేసుకుంది. బాధవత్ రమణి మద్యానికి బానిసై ప్రతి రోజూ మద్యం సేవిస్తూ ఉండేదని, ప్రతిరోజూ మద్యానికి డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులతో గొడవపడేది. ఇదే క్రమంలో డబ్బులు ఇవ్వమని ఆమె కొడుకు స్వామిని అడగగా ఆయన ఇవ్వలేదు. రమణి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మరణించింది.