Jan 01, 2025, 06:01 IST/
మందు బాటిళ్లతో నిండిపోయిన ఉప్పల్ స్టేడియం (వీడియో)
Jan 01, 2025, 06:01 IST
హైదరాబాద్‌లోని ఉప్పల్ మున్సిపల్ స్డేడియానికి ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లిన స్థానికులు స్టేడియాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. స్టేడియం మొత్తం మందు బాటిళ్లతో నిండిపోవడంతో కంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా అధికారుల వద్ద పర్మిషన్ తీసుకొని కొందరు స్టేడియంలో వేడుకలు జరుపుకున్నారు. అయితే రాత్రి రచ్చ రచ్చ లేపిన మందుబాబులు క్లీన్ చేయకుండానే వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.