రైతులకు, మహిళలకు పౌల్ద్రి కోడి పిల్లల పంపిణీ

1074చూసినవారు
రైతులకు, మహిళలకు పౌల్ద్రి కోడి పిల్లల పంపిణీ
జనగామ జిల్లా చిల్పూర్ మండల పరిధిలోని గిరిజన తండాలలో గురువారం రైతులకు, మహిళలకు (పౌల్ట్రీ) కోడి పిల్లలు లోడి సాంఘిక సేవ సంస్థ మానోస్ యూనిదాస్ వారి సహకారంతో ప్రాజెక్టు డైరెక్టర్ విజయపాల్ రెడ్డి ఆదేశానుసారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కో ఆర్డినేటర్ బాలచౌరీ మాట్లాడుతూ... రైతులు, మహిళలు కోడి పిల్లలను పెంచి పోషించినట్లైతే రైతులకు కొంత మేరకు ఆదాయం చేకూరి కుటుంబం పోషణకు ఉపయోగపడుతుందని, అలాగే ఆదాయాలు పెంచుకోవచ్చునని ఆర్ధికంగా స్థిర పడవచ్చునని తెలిపారు. సుమారు 200 వందల మంది రైతులకు 2000 కోడి పిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ కో ఆర్డినేటర్స్ సత్యనారాయణ, కనకం రవీందర్, సరితా, అశోక్ పాల్, గుగులోత్ వెంకన్న, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్