మానవత్వాన్ని చాటుకున్న మాజీ ఎమ్మెల్యే

579చూసినవారు
జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండల కేంద్రం సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడిని పరిశీలించారు. అనంతరం అంబులెన్స్ లో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ విధంగా తాటికొండ రాజయ్య తన మానవత్వాన్ని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్