జనగామ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 20 జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉపాధి కల్పనాధికారి ఎం. మల్లయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముత్తూట్ మైక్రోఫిన్ ప్రైవేట్ కంపెనీ రిలేషన్షిప్ ఆఫీసర్స్, రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలకు జాబ్ మేళా ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 7995430401 నెంబర్ ను సంప్రదించాలన్నారు.