ఎన్నో ఏళ్ల కలగా మిగిలిపోయిన కాజీపేట బ్రిడ్జి పనులకు పునర్నిర్మాణం చేపట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చిన మెటీరియల్ పరిశీలించారు. గత ప్రభుత్వ పాలకుల ఒంటెద్దు పోకడలతో కాజిపేట్ బ్రిడ్జి నిర్మాణా పనులను ఆపిన కూడా నిధులను విడుదల చేయించడం జరిగిందన్నారు.