స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పెళ్లి రోజు సందర్బంగా సోమవారం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు, ఈవో ఎమ్మెల్యే దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికీ ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వినయ రాణి దంపతులకు స్వామి వారి ఆశీర్వచనలు అందజేశారు.