వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ, తూనికలు, కొలతల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 2024-25 వానాకాలం ధాన్యం కొనుగోలుకు సన్నదం కావాలని అన్నారు.