మంగళవారం తెల్లవారుజామున వరకు వరంగల్ చిన్నవడ్డెపల్లి చెరువు వద్దకు వినాయకులు భారీగా చేరుకున్నాయి. దీనితో నిమజ్జన ప్రాంతం వద్ద భారీగా రద్దీ కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిమజ్జనానికి బ్రేక్ ఇవ్వడం వల్ల సుమారు 2 గంటలకు పైగా భక్తులు వేచి చూస్తున్నారు. నిమజ్జనం ఏర్పాట్లలలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం అయినట్లు భక్తులు తెలుపుతున్నారు.