హనుమకొండ హంటర్ రోడ్ లోని కాకతీయ మహిళా జూనియర్ కళాశాలలో గ్రూప్ 2 పరీక్ష రాయడానికి హాల్ టికెట్ లేకుండా రావడంతో అభ్యర్థిని కళాశాల సిబ్బంది పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. అభ్యర్థి ఆలస్యంగా రావడం, ఉదయాన్నే ఇంటర్నెట్ సెంటర్లు తెరవకపోడం వల్ల హాల్టికెట్ ప్రింట్ తీస్కోవడం కుదరలేదని చెప్పారు. సదరు వ్యక్తి దామెర మండలం పులుకుర్తికి చెందినవాడు.