వరంగల్ తూర్పు గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు అండర్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పలు కాలనీలలో ఇల్లు నీట మునిగి ఇంటిలోకి నీరు వచ్చి ప్రజలు ఇబ్బంది పడడానికి పైపే కారణం అని ప్రజలు తెలిపారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ పైపులు తొలగించి కాలనీలు నీట మునగకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.