అర్హులైన వారికి సర్వే నిర్వహించి రైతు భరోసా కింద సంవత్సరానికి 12000 ఇస్తామని మంత్రి కొండ సురేఖ అన్నారు. శనివారం దుబ్బాకలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ తో కలిసి పర్యటించారు. ముందుగా దౌల్తాబాద్ మండలం బాలికల వసతి గృహాన్ని ప్రారంభించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణం కోసం భూమి పూజ వద్ద అధికారులు వేసినటువంటి ఫ్లెక్సీలో ఎమ్మెల్యే పేరు లేకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది.