వరంగల్ పాత బీటు బజార్ లో (సిఐటియు )కార్మిక సమ్మె విజయవంతం

646చూసినవారు
ఈ రోజు 08. 10. 2021 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు కార్మిక సమ్మెను జయప్రదo చెయ్యడం కోసం వరంగల్ పాత బీటు బజార్లో హమాలి గుమస్తా కార్మికుల ఆధ్వర్యంలో ర్యాలీ తీస్తూ సమ్మెను విజయవంతం చెయ్యడం జరిగింది. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఇనుముల శ్రీనివాస్ పాలుగోని మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు కావస్తుంది అయినా ఇప్పటి వరకు 73 షెడ్యూల్డ్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల కొత్త జీవో లు విడుదల చేయలేదు ఆన్నారు.

నిత్య అవసరాల సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా జీవోల ను కనీస వేతనాలను పెంచే సోయి టీ ఆర్ ఎస్ ప్రభుత్వం కు సోయి కూడలేదు మరో వైపు కార్మిక వర్గం 100 ఏండ్లు గా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాల్గు లేబర్ కోడ్ లు గా మార్చి కార్మిక వర్గాన్నీ బానిసత్వం లోనికి నెట్టింది దేశ సహజ వనరులు ప్రజా సంపద ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు తెగనమ్ముతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 73 షెడ్యూల్డు పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలను సాధించుకునే అంతవరకు పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కార్మిక వర్గం కు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ నాయకుడు నాగపూరి వెంక్కటేశ్వర్ల్ రైతు సంఘము జిల్లా నాయకులు ఆకుల మురళీ, గుమస్తా హమాలి సంఘము నాయకులు బాబురావు, మనోహర్, కోటి ,రమేష్, వీరేశం తదితరులు పాల్గొన్నారు..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్