మాడిఫైడ్ సైలెన్సర్ల వాహనాలు సీజ్

64చూసినవారు
మాడిఫైడ్ సైలెన్సర్ల వాహనాలు సీజ్
మాడిఫైడ్ సైలెన్సర్లను బిగించుకుని వాడుతున్న 10 బుల్లెట్ బైక్ లను ఆదివారం ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. వాహనాలతో వచ్చిన సైలెన్సర్లను మార్చి శబ్ద కాలుష్యానికి కారకులవుతున్న వాహనదారులను పట్టుకున్నారు. వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. మెకానిక్లు సైలెన్సర్లను మార్చితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలకు సైలెన్సర్లు మాడి ఫైడ్ చేసినా, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన సీజ్ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్