కక్కిరాలపల్లి గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలోనే గ్రామంలోని రైతు పడిదల సమ్మారావు పశువుల కొట్టం ప్రారంభించారు. వేల్పుల కుంటలోకి వర్షపు నీరు రావడానికి వందరోజుల ఉపాధి హామీ పని కింద కాలువను ప్రారంభించారు. వంద రోజుల ఉపాధి హామీ పనులను గ్రామస్తులు వినియోగించుకోవాలని ఉపాధి హామీ కూలీలకు తగు సూచనలు సలహాలు చేసారు.