వరంగల్ ఎయిర్ పోర్ట్ కు, వరంగల్ డెవలప్మెంట్ కు నిత్యం కృషి చేస్తున్న వేం నరేందర్ రెడ్డిని వరంగల్ జిల్లాకు చెందిన ముత్యాల విజయ్ జడల శ్యామ్ మిత్ర బృందం తన స్వగృహంలో కలిసి శాలువాలతో పూల బొకేలతో బుధవారం సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో వరంగల్ ను హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న వేం నరేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.