వరంగల్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర యువ టూరిజం క్లబ్ ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఏడవ తరగతి నుండి డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో మాత్రమే ఈ క్లబ్బులను ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.