వరంగల్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలి
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించుటకు కృషి చేయాలనీ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ ఆద్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 2లక్షల 66వేల 664 లబ్ధిదారులకు 509 రేషన్ షాపులలోద్వారా ప్రతినెల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ తెలిపారు.