చెత్తాచెదారంతో నిండిపోయిన మున్సిపల్ కార్యాలయం

558చూసినవారు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఆవరణం చెత్తాచెదారంతో నిండిపోయింది. నగరం మొత్తాన్ని శుభ్రపరిచే మున్సిపల్ కార్మికులు, అధికారులు ఉండే ఈ కార్యాలయంలో ఇలాంటి దుస్థితి ఏర్పడడం పై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. సోమవారం కార్యాలయానికి వచ్చిన నగర ప్రజలు చెత్తాచెదారంతో దర్శనమిస్తున్న కార్యాలయాన్ని చూసి ముక్కు మీద వేలేసుకున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్