హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం సందర్శించారు. గురుకుల పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యతో పాటు ఏకరూప దుస్తులు, టెక్స్ట్, నోట్ బుక్స్ పంపిణీ గురించిన వివరాలను ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు.