రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో బాధితులకు చెల్లించే పరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం హైద్రాబాద్ నుండి ఆయన రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి తో కలిసి భూ సేకరణ పురోగతిపై ఎదురవుతున్న సమస్యలపై సంబందిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు.