హన్మకొండ జిల్లా. కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో ఓ రైతు నుండి పత్తిని కొనుగోలు చేస్తూ రిమోట్ సెన్సార్ తో చేసిన మోసాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. రిమోట్ సెన్సార్ వెయిట్ మిషన్ తో పాటు ఆటో ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. అంబాల గ్రామానికి చెందిన గండ్ర రాజకుమార్, పంగిడిపల్లి గ్రామానికి చెందిన సానబోయిన అశోక్ లపై పోలీసులు కేసు నమోదు చేసారు.