ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం గణేష్ నిమజ్జనం మహోత్సవాలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంగమ్మ ఒడికి 8, 066 విగ్రహాలు చేరనున్నాయి. గ్రేటర్ లో మొత్తం 11 చెరువుల సెంటర్లలో నిమజ్జనానికి సిద్దం అవ్వగా, ఒక్క కొట చెరువుకు మాత్రం గ్రీన్ ట్రిబునల్ నిషేధ ఆజ్ఞలు విధించింది. ట్రైసిటిలో 22 క్రేన్లు, 40 తెప్పలు, 1200 వందల మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.