మహాత్మ జ్యోతి బా పూలే బీసీ గురుకుల పాఠశాల (బాలుర) హన్మకొండ నందు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని శుక్రవారం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ యస్. వెంకటప్రసాద్ సావిత్రిబాయి పూలే ఫొటోకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచి అలాగే అణగారిన వర్గాలో వెలుగులు నింపింది అని తెలియజేసారు.