రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలోని సాకేత హై స్కూల్ విద్యార్థులు మెదక్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ 24న మెదక్ జిల్లాలో స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్ బాల్ పోటీలలో సాకేత స్కూల్ విద్యార్థులు పాల్గొని పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మంగళవారం తెలిపారు.