ఇతర మతాలను గౌరవిస్తూ సంతోషాల నడుమ పండుగలను నిర్వహించుకుందామని వరంగల్ సీపీ తెలిపారు. ఆదివారం కమిషనరేట్లో ట్రై సిటికి చెందిన ముస్లిం మత పెద్దలు, శాంతి కమిటీతో సమావేశమయ్యారు. ఈ నెల 16వ తేదిన మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు నిర్వహించాల్సి ఉండగా అదే రోజు గణేశ్ నిమజ్జనం ఉన్నందున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా 19వ తేదిన మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలను నిర్వహించేందుకు ముస్లీం మత పెద్దలందరూ అంగీకరించారు.