సీఎం రాక ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

68చూసినవారు
వరంగల్ నగర పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్న సభా స్థలి ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో కలిసి శనివారం క్షేత్ర స్థాయిలో పర్యటించి తగు సూచనలు చేశారు. గ్రౌండ్ ఆవరణను కలియ తిరిగి ఏర్పాట్లకు సంబంధించిన మ్యాపును పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్