ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

53చూసినవారు
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలను అందించగా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి స్వీకరించారు. ప్రజలు అందించిన వినతులను అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్