హనుమకొండ: సఖి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి

55చూసినవారు
హనుమకొండ: సఖి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి
సఖి కేంద్రంలో అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో సఖి కేంద్రం ద్వారా మహిళలకు అందిస్తున్న వివిధ సేవలకు సంబంధించిన పోస్టర్ తో పాటు వీడియోను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమస్యల్లో ఉన్న మహిళలు సఖి కేంద్రం వాట్సప్ నెంబర్ 7382983088, ఉమెన్ హెల్ప్ లైన్ 181 ద్వారా సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్