ఇటీవల నూతనంగా ఎన్నికైన వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ శామంతుల శ్రీనివాస్, కమిటీ సభ్యులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కొండా మురళీదర్ రావు మాట్లాడుతూ. నూతన చైర్మన్ శామంతుల శ్రీనివాస్ ను, కమిటీని అభినందిస్తూ బాధ్యతయుతంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తేవాలని, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించుట్లో ముందుండాలన్నారు.