ఎన్యో త్యాగాలు, కష్టనష్టాలను అధిగమించి విజయవంతంగా విధులు నిర్వహించహిన మీరూ నేటి తరం పోలీసులకు స్పూర్తిదాయకం అవుతారని వరంగల్ పోలీస్ కమిషనర్ పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులకు తెలిపారు. సోమవారం వరంగల్ పోలీస్ విభాగంలో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేస్తున్న పోలీస్ అధికారులను సీపీ ఘనంగా సత్కరించారు. పదవీవిరమణ పొందుతున్న ఎస్సైలు యూసుఫ్, కుమారస్వామిలకు జ్ఞాపికలను అందజేసారు.