రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వినూత్నమైన పథకాలు చేపడుతుందని జిల్లా పరిషత్ సభ్యులు సర్వర్, ఇస్లావత్ తండా సర్పంచ్ రమేష్ లు ఆన్నారు. గిరిజనులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు. బుధవారం నాడు వారు ఇస్లావత్ తండాపంచాయతీ పరిధిలోని స్మశానవాటిక స్లాబ్ నిర్మాణపనులను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రావూర్ సర్పంచ్ బండిసంతోష్, రెడ్యానాయక్, రవి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.