మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గురువారం చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అర్పించారు. భారత దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ దేశంకోసం సర్వస్వం ధారపోసిన మహనీయురాలని కొనియాడారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, 20 సూత్రాల కార్యక్రమం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు.